పవన్ పై జగన్.. మరో కొత్త డ్రామా షురూ..
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నేతలతో పాటు ఆ పార్టీ అధినేత జగన్ కూడా పవన్ కళ్యాణ్ గురించి చాలా తేలికగా మాట్లాడారు. దత్తపుత్రుడని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ పై ఎన్నో ఆరోపణలు కూడా చేశారు. అయితే అనూహ్యంగా కూటమి గెలవడం, జగన్ 10 సీట్లతో సర్దుకోవాల్సి రావడం తో వైసీపీ నేతల గొంతులు ఎక్కడ వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ ని విమర్శించే జగన్ తొలిసారి అతనిపై పాజిటివ్ గా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇది ఎన్నికల అనంతరం వచ్చిన మార్పా.. లేక రాబోయే ఎన్నికల కోసం ఇప్పటినుంచి జాగ్రత్త పడుతున్న తీరా అన్న విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. గత నాలుగు నెలలుగా జగన్, అతని పార్టీ వ్యక్తులు పవన్ గురించి పెద్దగా మాట్లాడటం మానేశారు. ఫుల్ కాన్సన్ట్రేషన్ చంద్రబాబుపై పెట్టి జగన్ తన ప్రసంగాలు ముగిస్తున్నాడు. సైలెంట్ గా ఉన్న జగన్ కాస్త సడన్ గా పిఠాపురం వచ్చి వరద బాధితులను పరామర్శించారు.
పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో అతనిపై ఖచ్చితంగా ఏదో ఒక విమర్శ చేస్తారు అని ఆశించిన అందరికీ షాక్ ఇచ్చేలా జగన్ మాట్లాడారు. తన విమర్శలు మొత్తం బాబుకే పరిమితం చేస్తూ పాపం పవన్ కళ్యాణ్ అంటూ తెగ సింపతి కురిపించారు. పవన్ సినిమా స్టార్ అన్న జగన్ చంద్రబాబు ఆయనను మించిపోయిన డ్రామా ఆర్టిస్ట్ అని అన్నారు. పవన్ కళ్యాణ్ కొత్తగా బాధ్యతలు చేపట్టారు.. కానీ అన్నీ తెలిసిన చంద్రబాబు మాత్రం అచ్చమైన డ్రామా ఆర్టిస్టుల ప్రవర్తిస్తున్నారు అని జగన్ నిందించారు. ఇలా మొదటిసారి పవన్ పై జగన్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం షాక్ కి గురి చేస్తుంది. ఇదంతా కేవలం పవన్ వల్ల బాబుకి పవర్ దక్కింది అన్న ఆలోచన వల్లే జరుగుతుంది అని అందరూ భావిస్తున్నారు.













