వచ్చే 48 గంటల్లో ప్రతీ ఒక్కరికీ : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌కు వస్తోన్న వరద క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా కూలకూడదని, బాధితులకు రూ.2 వేల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని ఆదేశించారు. వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయాలు, కేజీ పామాయిల్ పంపిణీ చేయాలన్నారు. వరద బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో ఇవన్నీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముంపునకు గురైన ప్రతి గ్రామంలో పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు, సినీయర్ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకొని పని చేయాలన్నారు.
కొందరు రాష్ట్రం, అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నిధుల సమస్య లేనే లేదన్నారు. ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే మరణించినట్టుగా సమాచారం. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందాలి. ఎక్కడ అవసరం అయితే అక్కడ శిబిరాలు కొనసాగించండి. పారిశుధ్యం, ఉండేలా, ఆహారం, తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లోగా పంట, ఆస్తి నష్టంపై అంచనాలు పూర్తి చేయాలి. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వచ్చే 48 గంటల్లో ఈ సమస్య ను పరిష్కరించాలి అని సీఎం ఆదేశించారు.













