ఏపీ సీఎం కీలక నిర్ణయం
కరోనా బాధితులకు ఏ ఆస్పత్రి కూడా వైద్యానికి నిరాకరించకూడదని, అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కొవిడ్ 19 బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేస్తామన్నారు. ఇటువంటి ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కోవిడ్ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ 19 నివారణ చర్యలపై క్యాంప్ కార్యాలయంలో సీఎ వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. రాష్ట్రంలో కోవిడ్ 10 పరీక్షలు, కేసుల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.













