నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి : జగన్
నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికల పక్రియ పూర్తి చేయాలని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈనెలా•రులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చామని గుర్తు చేశారు. నగదు, మద్యం పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతోనే ఆ ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. నగదు పంపిణీ చేసినట్లు ఎన్నికల తర్వాత నిర్దారణ అయిన అనర్హత వేటు వేస్తామని, రెండు, మూడేళ్ల వారికి జైలు శిక్ష పడుతుందని చెప్పారు. జిల్లాల ఎస్పీలు నగదు, మద్యాన్ని అరికట్టాలని, స్థానిక ఎన్నికలను పోలీసు యంత్రాంగం ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్రులను, గ్రామంలో మహిళా పోలీసులను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. ఎక్కడ నగదు, మద్యం పంపిణీ చేశారన్న మాట రాకూడదన్నారు.
ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి వచ్చి రూ.కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలవడం కాదని, గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేసే వ్యక్తులే ఎన్నికవ్వాలని సీఎం ఆకాంక్షించారు. అందుకే పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేశామని అన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పక్రియ దేశానికి ఆదర్శం కావాలన్నారు. సాధారణ ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి ఉపయోగించిన మాదిరిగానే ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉండే పోలీసు మిత్రులు సచివాలయాల్లో ఉండే మహిళా మిత్రులు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద ఈ యాప్ ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.













