ఆ ఘనత మన ప్రభుత్వానిదే
పంటల బీమా విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.3వేల కోట్లు బీమా అందించామని, ఆ ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇడుపులపాయలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం సమీక్ష చేపట్టారు. విడతల వారీగా పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై స్థానిక నాయకులు, అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. పులివెందుల ఏరియా డెవలప్మెంట్స్ ఏజెన్సీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతులంతా ఈ`క్రాప్ తప్పనిసరిగా చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలోనే 40 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. చక్రాయపేట మండంలో రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.













