Ys Jagan: ఐప్యాక్ వద్దు జగన్
2019లో వైసీపీ అధినేత వైయస్ జగన్(YS Jagan) విజయం సాధించడానికి ఐపాక్ టీం కీలకం. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్.. ఏం చెప్తే జగన్ అది చేసేవారు. జగన్ మానసిక పరిస్థితిపై కూడా ఐపాక్ ప్రభావం చూపించింది అంటే.. వాళ్ళు ఏ స్థాయిలో పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక జగన్ వస్త్రధారణ పై కూడా ఐపాక్ టీం ప్రభావం చూపించింది. దీనితో జగన్ పక్కా రాజకీయ నాయకుడిగా మారిపోయి కొత్త స్టైల్ కు తెర తీశారు. 2019లో జగన్ గెలిచిన తర్వాత ఐపాక్ టీం ప్రజల్లోకి జగన్ ను మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది.
అయితే పరిపాలనలో లోపాలు ఉండటం.. జగన్ తీసుకునే నిర్ణయాలు సంచలనాలు కావడం.. వాటిపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో 2024 ఎన్నికల్లో వైసీపీ(YSRCP) ఓడిపోయింది. అయితే ఇప్పుడు ఐప్యాక్ టీం విషయంలో వైసీపీ కార్యకర్తలు సీరియస్ గా ఉన్నారు. తాజాగా విజయవాడలో జరిగిన ఒక సంఘటన పై ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇప్పటికైనా జగన్ ఐ ప్యాక్ టీంను పక్కనపెట్టి సొంతగా కష్టపడే ప్రయత్నం చేయాలని, అవసరమైతే మరో సంస్థతో ఒప్పందం చేసుకోవాలని.. ఎప్పుడూ పాత ట్రిక్స్ వర్కౌట్ అవ్వవు అని హెచ్చరిస్తున్నారు.
ఇక అనుకూల మీడియా కూడా జగన్ పై అతిగా భజన చేయడం కరెక్ట్ కాదు అంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై వైసీపీ అనుకూలంగా వ్యవహరించే కొన్ని వెబ్సైట్ లు.. అలాగే కొన్ని ఫేస్బుక్ పేజెస్ కూడా ఆ పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నాయి. అనవసరంగా ట్రోలింగ్ కు గురవుతున్నారని.. కాబట్టి జగన్ జాగ్రత్తగా ఉంటే మంచిదని.. ఏం చేసినా సరే ప్రజల్లో అది నటన అనే అభిప్రాయం వ్యక్తం అవుతుందని.. విజయవాడలో జరిగిన ఘటన దీనికి ఉదాహరణ అంటూ హెచ్చరిస్తున్నారు వైసిపి కార్యకర్తలు.
జయవాడలో జగన్ తో ఫోటో దిగడానికి ఏడ్చిన చిన్నారి చరిత్ర మొత్తం బయటికి తీసిన టిడిపి సోషల్ మీడియా.. జగన్ ను ఎండగట్టింది. దీనితో ఆ వీడియోను వైసీపీ ఎంత ప్రచారం చేయాలనుకుని భావించినా.. ప్రజల్లోకి మాత్రం అదే నటనగానే వెళ్ళింది. దీనితో జగన్ ఐపాక్ టీం ను పక్కన పెడితే మంచిదని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.













