రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్
రాష్ట్ర అవతరణ వేడులకను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత స్వాతంత్య్రోద్యమంలో ఆంధ్రులు అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర అవతరణ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.













