కాల్‌సెంటర్‌ను ప్రారంభంచిన సీఎం జగన్
అవినీతి నిర్మూలనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ముందడుగు వేశారు. అవినీతిపై ఫిర్యాదు స్వీకరించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్ హెల్ప్‌లైన్ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతకం సీఎం జగన్ నేరుగా కాల్ సెంటర్‌కి ఫోన్ చేసి పనితీరు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే 14400కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఎలాంటి ఫిర్యాదులైనా 15 రోజుల నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏసీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













