బెంగళూరుకు ఏపీ సీఎం
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరారు. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి అక్కడున్న తన నివాసానికి జగన్ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు దక్కించుకున్న విషయం విదితమే. కుమార్తెను పారిస్ పంపించి అనంతరం జగన్ తిరిగి 27న తాడేపల్లి చేరుకోనున్నారని సమాచారం. ఇదిలావుంటే చాలా రోజులుగా ఆంధప్రదేశ్‌లో ఉన్న ముఖ్యమంత్రి జగన్.. కుమార్తె కోసం రాష్ట్రం దాటారు. సీఎంతో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతీ కూడా బెంగళూరు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.













