YS Jagan: దిక్కుమాలిన మాటలొద్దు: జగన్ ఫైర్
పద్మావతి హాస్పిటల్ వద్ద క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ (Ys Jagan) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. తిరుపతి (Tirumala)లో జరిగిన ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు.. ఎప్పుడు కూడా చూడలేదన్నారు జగన్. వైకుంఠ ఏకాదశి ప్రతి ఏడాది జరుపుకుంటాం.. లక్షలాదిమంది ప్రజలు హాజరవుతారని అందరికీ తెలుసని.. వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని.. ఆ పుణ్య దర్శనం కోసం లక్షలాదిమంది ప్రజలు దర్శనానికి వస్తారని లక్షల మంది జనం వస్తారని తెలిసి కూడా కౌంటర్ల దగ్గర సెక్యూరిటీ అలయన్స్ ఎందుకు పాటించలేదని నిలదీశారు.
చంద్రబాబు(Chandrababu Naidu) కుప్పంలో ఉన్నారని పోలీస్ యంత్రాంగాన్ని కుప్పంకి పంపించారన్నారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు పోలీసులు కుప్పం చేరారని మండిపడ్డారు. 6, 7, 8 తారీకు మధ్యాహ్నం దాకా చంద్రబాబు ఇక్కడే ఉన్నారని చంద్రబాబు పర్యటన ఉన్నప్పుడు పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదు అని ప్రశ్నించారు. చంద్రబాబు, పోలీసులు దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతున్నారన్నారు. మూడు దగ్గర్ల తొక్కిసలాట జరిగింది. కానీ చంద్రబాబు, అధికారులు ఒక్క దగ్గర అని చెప్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు, టీటీడీ అధికారులు, కలెక్టర్, ఎస్పీ ఈ హత్యలకు బాధ్యులు అని జగన్ ఆరోపించారు. పోలీసులను తమ భద్రతకు వాడుకొని ప్రజలను గాలికి వదిలేశారని 50 నుంచి 60 మందికి తొక్కిసలాటలో గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు. టీటీడీ చైర్మన్ దగ్గర నుండి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసారని కనీసం గాయాలైన వారికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఎంతో గొప్పగా నిర్వహించామన్నారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పు అని జగన్ మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నా చనిపోయిన వారికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేసారు. క్షతగాత్రులకు ఐదు లక్షలు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ ఈ ఘటనకు బాధ్యులన్నారు. వీళ్ళందరూ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు. ఈ ఘటనలకు సంబంధించి ఎఫ్ఐఆర్ చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఇద్దరు కొట్టుకుంటే ఉండే సెక్షన్లు ఆపాదించారని ఇది ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగిన ఘటన అంటూ మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బ్లాక్ మార్క్ గా నిలిచిపోయే ఘటన ఇది అంటూ ఆరోపించారు.













