Y.S.Jagan: జగన్..చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అవసరమా?
ఒక్క ఛాన్స్ అంటూ.. పాదయాత్రతో ఆంధ్రాలో ప్రజలను అందరిని తన వైపుకు తిప్పుకొని 2019 ఎన్నికల్లో జగన్ (Jagan) అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే వచ్చిన గెలుపుని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు అనే వాదన బలంగా వినిపించింది. జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన ఎన్నో తప్పులపై అప్పటిలో కూటమి ఊరు వాడ ప్రచారం చేసింది. అయిన డామేజ్ కి జగన్ అప్పట్లోనే సరిదిద్దుకొని ఉంటే 2024 ఫలితాలు వేరే రకంగా ఉండే అవకాశం ఉండేది..
ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో కూడా ఇటు పవన్(Pawan) .. అటు చంద్రబాబు (Chandra Babu) జగన్ హయాంలో ఆ పార్టీ నేతలు చేసిన ఎన్నో పనులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. అప్పుడే వాటికి రియాక్ట్ అయి మాటకు మాట సమాధానం ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఒకరకంగా ఎన్నికల సమయంలో జగన్ లేటుగా స్పందించారు.. దాని రిజల్ట్ ఎన్నికల ఫలితాలలో బలంగా కనిపించింది. అయితే తన మౌనం ఖరీదు తెలుసుకున్న జగన్ ఇప్పుడు తిరిగి డామేజ్ రిపేర్ కి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది.
తన హయాంలో జరిగిన వాటిని రోజుకొక సీరియల్ ఎపిసోడ్ లాగా వివరిస్తున్నారు. అయితే ఆ పనులు జరిగిన సమయంలో చెబితే జనాలకి బాగా గుర్తుండేది.. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు గడిచాక ఈ విషయాన్ని ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వివరించి ఉంటే ఇప్పుడు ఇంత తపన పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని సొంత పార్టీ నాయకులే అంటున్నారట.. అయితే జగన్ ఎవరేమనుకున్నా నాకేంటి అన్నట్టు గత మూడు రోజులుగా పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. కూటమిలో జరుగుతున్న తప్పుల లెక్కలు కూడా ఈ సందర్భంలో అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో ప్రారంభమైన నూతన మద్యం పాలసీ(AP Liquor policy) గురించి కూడా జగన్ మాట్లాడారు.. సాయంత్రం అయ్యేసరికి మద్యం నుంచి వచ్చిన కలెక్షన్ మొత్తం తమ్ముళ్ళ జోబుల్లోకి వెళ్తోంది అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు.
తన హయాంలో నేరుగా సాయంత్రానికి ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లే మద్యం లెక్కలు ఇప్పుడు ప్రైవేటుకు అప్పగించడం వల్ల తమ్ముళ్ల జేబుల్లోకి వెళ్తున్నాయి అని జగన్ అన్నారు. ఇక ఇసుక (Sand Mafia) విషయంలో కూడా కూటమి ఎన్నో అవకతవకలకు పాల్పడుతోంది అని జగన్ పేర్కొన్నారు. కానీ అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడి మాత్రం ఏం ప్రయోజనం.. ఇదేదో ముందే జాగ్రత్త పడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.. ఇదే కదా మన రాజకీయాలలో ఉన్న మ్యాజిక్.. పదవి ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకురారు.. పదవి పోయాక ప్రజలు పట్టించుకోరు..













