జగన్ కారు నడిపింది డ్రైవర్ కాదు…. ఆయనెవరో తెలుసా?
ఏజెన్సీ ప్రాంతంలో జగన్ పర్యటన ఒకవిధంగా ఆశ్చర్యానికి గురి చేసింది. దారులు సరిగా లేని సంగతి అలా ఉంచితే… మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అది. దట్టమైన అడవులు. కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా బలహీనం. అలాంటి చోటికి ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ప్రయాణించడం వైసీపీ శ్రేణులను కూడా ఉత్కంఠకు గురి చేసింది.
అత్యంత ఇరుకైన, రోడ్లు… లోయలతో కూడిన దారులు. అనుభవం లేని డ్రైవర్లు కానీ, సామర్ధ్యం లేని వాహనాలు కానీ ఆ దారుల్లో ప్రయాణించలేవు. నిజానికి జగన్ చాపరాయి గ్రామానికి బయలుదేరగానే ఆయన వెంట భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లేందుకు సిద్దమయ్యారు. కానీ ఏజెన్సీలో కొంత దూరం వెళ్లిన తర్వాత వారి వాహనాలు ఆ రోడ్లపై ప్రయాణం సాగించలేకపోయాయి. దీంతో వాహనాలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి.
ఏజెన్సీ ప్రాంతంపై పట్టులేని డ్రైవర్లకు ఆ రోడ్లపై వాహనాలు కూడా నడపడం సాధ్యం కాదు. చాపరాయి గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో వైసీపీ నేతలంతా ఆగిపోయారు. ఆ సమయంలో జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ముందుకు సాగలేదు. దీంతో అప్పటికప్పుడు పోర్వీల్ డ్రైవ్ వెహికల్‌ను రప్పించారు. అయితే దానికి బుల్లెట్ ఫ్రూప్ రక్షణ లేకపోవడంతో పోలీసులు అంగీకరించలేదు. కానీ వారికి సర్దిచెప్పి జగన్ ముందుకు వెళ్లారు. ఇంత రిస్కీ ఏరియాలో జగన్ కారు నడిపింది ఎవరంటే వైసీపీ యువనేత జక్కంపూడి రాజా.
జగన్‌ను పక్కన కూర్చోబెట్టుకుని కారు నడపడం తన డ్రీమ్ అని కాబట్టి ఒప్పించాలని జిల్లా అధ్యక్షుడిని రాజా కోరారు. ఈ విషయం జగన్‌కు చెప్పగా ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు. ఏజెన్సీలో నడపగవా అని ప్రశ్నించగా… నడపుతాను అన్న అని రాజా చెప్పి బయలుదేరారు. అలా జగన్ ఎవరూ లేకుండానే బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం లేకున్నా సరే ఏజెన్సీలో ప్రయాణం సాగించి చాపరాయికి చేరుకున్నారు. ఏజెన్సీ రోడ్లపై కారును జక్కంపూడి రాజా నడిపిన విధానాన్ని పార్టీ నేతలు అభినందిస్తున్నారు.













