విశాఖ శారదాపీఠంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యే పూజలు
విశాఖ శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్ర హోమం పూర్ణాహుతికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించారు. రాజశ్యామల పూజ కోసం వేద పండితులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సంకల్పం చేయించారు. తర్వాత ముఖ్యమంత్రి చేతుల మీదగా కలశ స్థాపన చేయించారు. వేద పండిత సభలో ఆయన పాల్గొన్నారు. విశాఖ శ్రీశారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ముఖ్యమంత్రి ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేశారు. రాజశ్యామలాదేవి యాగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ పాల్గొన్నారు.













