కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు : జగన్
కృష్ణా జిల్లాను నందమూరి తారక రామారావు జిల్లాగా మార్చుతామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన వైసీపీ అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ బంధువులు కొందరు వైఎస్ జగన్తో మాట్లాడారు. అనంతరం ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిమ్మకూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. దీంతో అక్కడున్నవారంతా హర్షధాన్యాలు చేశారు.













