వాన్‌పిక్ కేసులో సీఎం జగన్‌కు పెద్ద ఊరట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆక్రమాస్తుల వ్యవహారంలో వాన్‌పిక్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను అప్పీలేట్ ట్రైబ్యునల్ సవరించింది. వాన్‌పిక్ వ్యవహారంలో మొత్తం రూ.863.34 కోట్ల స్థిర, చరాస్తులను జప్తు ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను జారీ చేసింది. దీన్ని అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించగా వాటిని సవాలు చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతోపాటు జగన్, నిమ్మగడ్డకు చెందిన పలు కంపెనీలు అప్పీలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి. వీటిపై విచారించిన అప్పీలేట్ ట్రైబ్యునల్ తీర్పునిస్తూ జగన్, ఆయన కంపెనీలకు చెందిన రూ.538.31 కోట్ల స్థిర, చరాస్తులపై ఉన్న జప్తును తొలగించాలని ఈడీని ఆదేశించింది. నిమ్మగడ్డ, ఆయన గ్రూపులకు చెందిన కంపెనీలకు పాక్షిక అనుమతి మంజూరు చేసింది. రూ.274.95 కోట్లకు పూచీకత్తుగా బాండు సమర్పించాలని, ఈ బాండును సమర్పించిన వెంటనే ఆస్తులపై జప్తును తొలగించాలని ఈడీని ఆదేశించింది.













