వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. తన ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంటికి కాటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. వైద్యుల సూచన, తదుపరి చికిత్సల కోసం రెండు నెలల పాటు పొడిగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు నవంబరు 1 వరకు ఎస్కార్ట్ బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.













