ఉగాది పూజల్లో పాల్గొన్న ముఖ్య మంత్రి సతీమణి భారతి
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని.. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా ఈ జంట పండితుల దగ్గర నుంచి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖచ్చితం అన్న విశ్వాసం జగన్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చాలామంది గత కొద్దికాలం గా భారతి గారు పూజల్లో పాల్గొనడం లేదు అంటూ చెడు ప్రచారాలు చేస్తున్నారు. వీడియోలను ఎడిట్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి నాయకులు ఈ ఉగాది ఉత్సవ వీడియోలను వైరల్ చేస్తూ వారికి ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల కోసం జగన్ తన వంతు ప్రచారంలో బిజీగా ఉన్నారు.













