యువ శాస్త్రవేత్త మేఘనకు సీఎం అభినందన
ఫోర్బ్స్ యువ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన మేఘనచౌదరి బొల్లింపల్లి శాసనసభ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. ఆమెను జగన్ ప్రత్యేకంగా అభినందించారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, కుటుంబసభ్యులతో కలిసి ఆమె ముఖ్యమంత్రిని కలిశారు. మేఘన 2018 ఫోర్బ్స్ అండర్ 30 యువ శాస్త్రవేత్తల జాబితాలో చోటు సంపాదించారు. శుద్ధ ఇంధనంలో చేసిన పరిశోధనలకు మేఘన ఇంటెల్ సంస్థ -2018 యువశాస్త్రవేత్త అవార్డును గెలుచుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉనికిలికి చెందిన ఈమె తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.













