రాష్ట్రంలో కలకలం రేపుతున్న వినుకొండ హత్య ఉదంతం.. జగన్ కీలక నిర్ణయం..
వినుకొండలో నిన్న బుధవారం రాత్రి జరిగిన హత్య ఉదాంతం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పుడు ఇది ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో వైయస్ జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఆయన హుటాహుటిన తిరిగి ఆంధ్రకు వస్తున్నారు. సినిమాల్లో తప్ప నిజజీవితంలో కనివిని ఎరగని రీతిలో వినుకొండలో హత్య చోటుచేసుకుంది. తాను టీడీపీ కార్యకర్తను అని చెప్పుకుంటున్న జిలానీ అనే వ్యక్తి చేతిలో రషీద్ అనే యువకుడు అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు. హత్య సమయంలో రషీద్ చేయి తెగి రోడ్డుపై పడడం గమనార్హం. ఈ దారుణమైన ఘటనకు జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు కూడా. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది అన్న జగన్.. లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడ కనిపించడం లేదు అని అన్నారు. ఈ దారుణాలన్నీ కేవలం తమ పార్టీని అనగదొక్కాలి అనే కోణంలోని జరుగుతున్నాయని.. అయితే అధికారం ఎవరికి శాశ్వతం కాదని.. ఇటువంటి హింసలకు పాల్పడడం సరికాదని జగన్ పేర్కొన్నారు.
అంతేకాదు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ జరపాల్సిందిగా కోరుతున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అండగా ఉంటానని ఆయన ట్విట్టర్ వేదికగా భరోసా కూడా ఇచ్చారు.. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేవలం ట్విట్టర్లో స్పందిస్తే సరిపోదు అని భావించి బెంగుళూరు పర్యటన రద్దు చేసుకొని ఏపీకి బయలుదేరు తున్నారు అని తెలుస్తుంది.
ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జగన్ ఈ హత్య విషయంపై ఎలా స్పందిస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో టీడీపీ ఇంకా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. స్వతహాగా చంద్రబాబు ఎప్పుడు ఇటువంటి హింసాత్మక చర్యలకు ప్రోత్సాహం అందించరు. కాబట్టి కచ్చితంగా దీని వెనుక మరేదో రహస్యం ఉంది అని టీడీపీ అభిమానులు భావిస్తున్నారు. మరేం జరుగుతుంది అన్న విషయంపై రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది..













