Yoga Andhra: ప్రజల సహకారంతోనే ఇది గ్రాండ్ సక్సెస్ : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా విశాఖ (Visakhapatnam) వేదికగా నిర్వహించిన యోగాంధ్ర (Yoga Andhra) విజయవంతమవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టరేట్లో మంత్రులు (Ministers) , అధికారులతో చంద్రబాబు సమీక్ష చేపట్టారు. యోగాంధ్రలో 3 లక్షల మందికిపైగా పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతోనే ఇది గ్రాండ్ సక్సెస్ అయ్యిందని పేర్కొన్నారు. గిన్నిస్ రికార్డు (Guinness Record)లు సాధించడంపై ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు సీఎం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన యోగా డే తీరుపై సీఎం అధికారులతో చర్చించారు.













