వైసీపీ వర్సెస్ వారాహి-3
ఉత్తరాంధ్రలో పవన్ వారాహి-3 యాత్రకు రానుండడంతో రాజకీయంగా మరింత వేడిరగిలింది.. విశాఖ జిల్లాలో తొమ్మిది రోజులు పాటు పవన్ యాత్ర సాగనుంది. అటు తరువాత విజయనగరం, శ్రీకాకుళం తో ఉత్తరాంధ్రలో యాత్రను సక్సెస్ ఫుల్ గా ముగించాలని పవన్ భావిస్తున్నారు. ఆది నుంచి పవన్ ఫోకస్ అంతా ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర మీదే ఉంది. 34 సీట్లు ఉన్న ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసిపికి గెలవనివ్వనని పవన్ ప్రతినబూనారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో సైతం 34 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా పట్టు బిగించడం ద్వారా అధికార వైసీపీకి ఝలక్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు పొంది ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలన్నది పవన్ అభిమతం. పొత్తులు ఉన్నా లేకపోయినా ఉభయగోదావరి తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో 68 నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలన్నదే పవన్ లక్ష్యం. అందులో భాగంగానే వారాహి యాత్రకు పై ప్రాంతాలకు ప్రాధాన్యమించినట్లు తెలుస్తోంది. కనీసం 40 నియోజకవర్గాల్లో గెలుపొందితే.. కింగ్ మేకర్ గా మారవచ్చని పవన్ భావిస్తున్నారు. అందుకే వారాహి యాత్రలో ప్రత్యేక పిలుపు ఇవ్వనున్నారు.
వారాహి-3లో విశాఖలో భూకబ్జాలు, వైసీపీనేతల అవినీతిని పవన్ ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖలో వైసీపీనేతలు, ఇంచార్జ్ లను టార్గెట్ చేసే అవకాసముంది.దీంతో ముందస్తుగానే విశాఖ వైసీపీ నేతలు.. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.పవన్ ఉమ్మడి విశాఖలో వారాహి వెబ్ సిరీస్ 3 జరుగుతుంది. విశాఖకు, ఉత్తరాంధ్ర అన్యాయంపై నిలదీయడానికి ప్యాకేజీ స్టార్ వస్తున్నారట. పవన్‌కు 10 ప్రశ్నలు వేస్తున్నాను. సమాధానం చెప్పాలన్నారు మంత్రి అమర్నాథ్.
విశాఖకు ఏం అన్యాయం జరిగిందో పవన్ చెప్పాలన్నారు మంత్రి అమర్నాథ్. ఏం విజయం సాధించారని? వారాహి యాత్ర చేస్తారు? విశాఖలో మీ పార్టీ అభ్యర్థుల పేర్లు చెప్పండి. జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు పేరు చెప్పండి. విశాఖను పరిపాలన రాజధాని ప్రకటించినప్పుడు..పవన్ స్వాగస్తున్నామని చెప్పలేదు. టీడీపీ స్టాండే… జనసేన స్టాండు. బీజేపీతో పొత్తు ఉన్నా. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పవన్ అడ్డుకోలేదు. బీజేపీతో సంసారం…టీడీపీతో సహజీవనం జనసేన వేస్తున్నారు. టీడీపీ హయాంలో గుళ్ళు కూలకొడితే…ప్యాకేజీ స్టార్ మాట్లాడలేదు.” అని మంత్రి మండిపడ్డారు.













