బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి.. వైసీపీ మద్దతు
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బరిలోకి దించిన ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన మడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఆ ప్రకటనలో పేర్కొంది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గిరిజన మహిళjైున ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఆమెకు మద్దతు తెలపడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొంది. స్వతంత్య్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమని తెలిపింది. ముందుగా నిర్ణయించుకున్న రాష్ట్ర మంత్రివర్గం సమవేశం కారణంగా ముర్ము నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కావడం లేదని, ఆయనకు బదులుగా పార్లమెంటరీ నేత విజయాసాయిరెడ్డి హాజరు అవుతారని తెలిపింది.













