ఆ విషయం లో బీఆరెస్స్ ను ఫాలో అవుతున్న జగన్ పార్టీ..
ఆంధ్రా నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచీ వరసగా పదేళ్లపాటు బీఆరెస్స్ అధికారం కొనసాగించింది. అయితే గత ఎడాది హ్యాట్రిక్ విజయం సాధిస్తుంది అని ఆశించిన సమయంలో అనూహ్యంగా ఓటమి పాలైంది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని సున్నా సీట్లకు పరిమితం చేశారు.
నాటి నుంచి బీఆరెస్స్ నేతలు మెల్లిగా కారు దిగి హస్తానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. దీనికి తోడు అనూహ్యమైన విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన పునాది తిరిగి బలోపేతం చేసుకోవడం కోసం కార్ పార్టీ నేతలకు స్వాగతం పలుకుతోంది.ఇటీవల గ్రూపుగా కలిసి వెళ్లి బీఆరెస్స్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రిత్యా కారు పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి అన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలలో బీఆరెస్స్ రిచెస్ట్ పార్టీగా పేరు తెచ్చుకుంది.
దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే..ఆదాయ, వ్యయాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిన తాజా రిపోర్టు ప్రకారం ఈ విషయం స్పష్టమవుతుంది. దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలలో ఎక్కువ ఆదాయం కలిగిన పార్టీ బీఆరెస్స్ అని ఏడీఆర్ రిపోర్ట్ స్పష్టం చేసింది.2022 – 23 ఫైనాన్షియల్ ఇయర్ లో బీఆరెస్స్ రూ. 736.67 కోట్ల ఆదాయం సాధించిన పార్టీ గా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ఇక ఆ పార్టీ తర్వాత రెండవ స్థానంలో రూ.333.45 కోట్ల ఆదాయంతో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్,రూ.214.35 కోట్ల ఆదాయంతో మూడోస్థానంలో డీఎంకే,రూ.181 కోట్లతో నాలుగో స్థానంలో బీజేడీ ఉన్నాయి. ఇక ఐదో స్థానంలో రూ.74.78 కోట్లతో వైఎస్సార్సీపీ ఉంది. ఎన్నికల ఫలితాల విషయంలో బీఆరెస్స్ రూట్ ఫాలో అవుతున్న వైఎస్సార్సీపీ.. మరో విషయంలో కూడా ఆ పార్టీ అడుగుజాడల్లో నడవడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది.













