ఈ నెల 20న పాదయాత్ర : విజయసాయిరెడ్డి
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సృష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20న స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాటయాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్నామని, గాంధీ విగ్రహం నుంచి స్టీల్‌ప్లాంట్ వరకు పాదయాత్ర జరుగుతుందని ఆయన వెల్లడించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఇప్పటికే ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారని, అందులో అనేక సూచనలు చేశారని చెప్పారు. గనులు కూడా కేటాయించాలని ప్రధానిని కోరారని తెలిపారు. సుమారు 25.కి.మీ. మేర పాదయాత్ర జరుగుతుందన్నారు. 13 పార్టీల నేతలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నేతలను పిలిచినా రాలేదని అన్నారు.













