ఆగని వలసలు.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న మరొక వైసీపీ ఎమ్మెల్సీ..
వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో జరిగిన ప్రజా గళం సభలో ఆయన పసుపు తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జంగా కృష్ణమూర్తి.. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలన ఎలా ఉందో అందరికీ తెలుసని.. ఈ పరిస్థితులు గాడిన పడాలి అంటే అది కేవలం చంద్రబాబు లాంటి నేత వల్లే సాధ్యమని పేర్కొన్నారు. అప్పులు చేసే నాయకుడు కాదు విజన్ ఉన్న నాయకుడు కావాలని.. అందుకే టీడీపీ లో చేరానని చెప్పుకొచ్చారు. పల్నాడు ప్రాంతం రాక్షస పాలనతో అల్లాడిపోతోందని కృష్ణమూర్తి చెప్పారు. ఇసుక ,మైనింగ్ మాఫియాల అక్రమ రాజ్యం నడుస్తోందని జంగా విమర్శించారు. పల్నాడు బాగుపడాలి అంటే బాబు రావాలి అని అన్నారు.













