అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పుదు : వైసీపీ ఎమ్మెల్యే
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని అనవసరంగా ఇరికించారని ఆరోపించారు. కడపలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో వైసీపీ ముఖ్యనేతలతో అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పుదు. అరెస్టయినా ఆయన బెయిల్‌పై బయటకు వస్తారు. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వెనకుండి కుట్ర చేసి అవినాష్‌ను ఇరికించే ప్రయత్నం చేశారు. అవినాష్ రెడ్డి హింసను ప్రేరేపించరని మనసాక్షిగా నమ్ముతున్నా, మొదటి నుంచీ నేను ఇదే చెబుతున్నా. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదు. హత్యలో అవినాష్ పాత్ర ఉందని రుజువైతే నేను రాజకీయాల్లో ఉండనని తెలిపారు. నిందితుడిగా చేరిస్తే రాజీనామా చేస్తానని చెప్పలేదు. న్యాయస్థానంలో ఆ విషయం రుజువైతే రాజీనామా చేస్తాననే మాటకు నేను కట్టుబడి ఉన్నాను అని అన్నారు.













