జగన్ సీఎం అయితే.. మేమంతా అయినట్లే
ముఖ్యమంత్రి పదవిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉండాలని కోరుకున్నామని అది నెరవేరిందని నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అన్నారు. జగన్ సీఎం అయితే తామంతా అయినట్లేనని సృష్టం చేశారు. పదవులపై తనకు ఆశలేదని, మంత్రి పదవి రానందుకు తాను అసంతృప్తితో ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆమె జగన్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన్ను ఇప్పుడు మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. తొమ్మిదేళ్లు కష్టపడి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చామని, సీఎం పదవిలో జగన్ ఉండాలనే కోరుకున్నామని, తమకు పదవులేమీ వద్దని పేర్కొన్నారు.













