రాజ్‌నాథ్‌సింగ్ తో వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భేటీ.. త్వరలో
బీజేపీ లోక్‌సభ కోర్ కమిటీ వద్ద వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రతక్ష కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయవాడలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. ఈ క్రమంలో రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లి రాజ్‌నాథ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరిని కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భేటీపై రామచంద్రారెడ్డి స్పందించారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ప్రజాజీవితంలో ఉన్న నేను రాజకీయాల్లోనూ ఉండాలని ఆశిస్తున్నానని తెలిపారు. భవిష్యత్ రాజకీయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏ విషయమైనా ముందుగా చెప్పాకే నిర్ణయం తీసుకుంటానని వెల్లడిరచారు. అధికార వైసీపీ నుంచి దూరంగానే ఉన్నానని స్పష్టం చేశారు.













