నువ్వు ఓడిపోతే అది కచ్చితంగా చంద్రబాబు వెన్నుపోటే..
పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీ తో కలిసి నడవడానికి నిర్ణయించుకున్నారో అప్పటినుంచి ఏదో ఒక రకంగా విమర్శలకు గురి అవుతూనే ఉన్నారు. దత్తపుత్రుడని, ప్యాకేజీ ఇస్తారని ఎన్నో రకాలుగా పవన్ ను విమర్శించిన వైసీపీ నేతలు ప్రస్తుతం అతనిపై జాలి పడుతున్నారు. పవన్ వైఖరి చూస్తే జాలిపడాలా..లేక కోప్పడాలా..కూడా అర్థం కావడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ పై విమర్శలు కురిపిస్తున్నారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అనగానే అక్కడ టీడీపీ ఇన్ ఛార్జ్ వర్మ అనుచరులు పవన్ కు వ్యతిరేకంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తెలుగుదేశం జెండాలని కూడా తగలబెట్టారు. అయితే ఇది చంద్రబాబు వ్యూహంలో భాగం అని ఆరోపిస్తున్నారు కొందరు. కూటమిలో ఉన్నటువంటి పార్టీ అధినేత పోటీ చేసే ప్రాంతంలో తమ అభ్యర్థులను ముందుగానే చంద్రబాబు కంట్రోల్ చేయాల్సి ఉందని.. కావాలని చేసి ఉండకపోవచ్చు అని వారి వాదన. ఇక పవన్ ఒకవేళ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే.. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతానని.. తాను కాకినాడ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. మరో పక్క వర్మ మాత్రం పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయకపోతే ఆస్థానం కూటమి అభ్యర్థిగా తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పవన్ పొరపాటున అసెంబ్లీకి పోటీ చేసినా పనిగట్టుకొని మరి చంద్రబాబు ఇండైరెక్టుగా పవన్ ని ఓడిస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీలో లోకేష్ తో పాటు పవన్ కూడా ఎంటర్ అయితే చిన్న బాబు మెయిన్ ఫోకస్ నుంచి తప్పుకుంటారు అన్న భయంతో చంద్రబాబు ఇదంతా చేయిస్తున్నారు అంటున్నారు వైసీపీ నేతలు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ పవన్ జాగ్రత్త.. ఏదన్నా అటూ ఇటూ జరిగితే ముందు నిన్ను ఓడించేది నీ వెనక ఉన్న టీడీపీ అని గుర్తుపెట్టుకో అంటూ ట్వీట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ అయింది.













