వైసీపీకి దగ్గుబాటి రాజీనామా ?
వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేశ్ చెంచురామ్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధించిన షరతుల నేపథ్యంలో తన సతీమణి పురందేశ్వరిని బీజేపీలో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న దగ్గుబాటి తాను రాజకీయంగా మౌనం వహించాలని భావించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దగ్గుబాటి తన నిర్ణయాన్ని వైసీపీకి తెలియజేసే విధంగా రాజీనామా లేఖను పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆయనతోపాటు ఆయన కుమారుడు కూడా రాజీనామా చేసినట్లుగా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.













