విజయవాడలో మీడియాతో వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
కాపుల రిజర్వేషన్లపై బాబు నాటకాలు ఆడుతున్నారని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో ఏనాడూ కాపుల గురించి పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు. అసలు జస్టిస్ మంజునాధ్ గారు రిపోర్ట్ సబ్ మిట్ చేయలేదని చెబుతున్నా.. విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ చంద్రబాబు పోలవరంపై ప్రకటన చేస్తూ.. కేంద్రం అడిగే దణ్ణం పెట్టి ఇస్తానని చెప్పారు. పోలవరం నుంచి ప్రజల ద)ష్టి మరల్చటానికే బాబు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. కాపుల విషయంలో బాబు నెత్తిన ఉన్న బాధ్యతను మోడీ నెత్తిన నెడుతున్నారని అంబటి తెలిపారు. అంతేకాకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి.. కాపులంతా సంతోషంగా ఉన్నారనే భ్రమను కల్పించటానికి ప్రయత్నిస్తున్నారని అంబటి అన్నారు.
మంజునాధ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఇంతవరకు ప్రభుత్వ వెబ్ సైట్ లో ఎందుకు పెట్టలేదని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. బీసీలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. కాపులకు 5% మాత్రమే రిజ్వరేషన్లు ఎందుకు ఇస్తున్నారు. 10% ఎందుకు ఇవ్వటంలేదని రాంబాబు ప్రశ్నించారు. గతంలో సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో 50% శాతం దాటినా రిజర్వేషన్లు ఇవ్వొచ్చని చెప్పిందన్నారు. అయితే దానికి ఓ విధానం ఉందని అంబటి తెలిపారు. పక్కాగా గణాంకాలు అన్నీ ఉండాలన్నారు. చంద్రబాబు ఎక్కడ తొందరపడకూడదో అక్కడ తొందరపడుతున్నారని తద్వారా కాపులకు అన్యాయం చేస్తున్నారన్నారు. జస్టిస్ మంజునాధ రిపోర్ట్ ఇచ్చిన దాఖలు లేవని ఆయనే తెలిపారన్నారు.
కాపులను మోసం చేసే విధంగా ఎన్నికల్లో ఓట్ల కోసం బాబు జిమ్మిక్కులు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. శాస్త్రీయపద్ధతిలో చేర్చకపోతే కోర్టుల్లో నిలబడదని అంబటి తెలిపారు. ఎవరు కోర్టుకు వెళ్లి నిలబడినా శాస్త్రీయ పద్ధతిలో చేయకపోతే కోర్టుల్లో నిలబడదని దీనికి ఇందిరా సహాని కేసు ఉదహరించారాయన. బాబు తీరువల్ల కాపులు మరోసారి మోసపోయే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు కాపుల విషయంలో గందరగోళం స)ష్టిస్తున్నారన్నారని అంబటి మండిపడ్డారు.













