గుంటూరు లో వైసీపీ కి ఊహించని ఎదురుదెబ్బ..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసిపికి మరొకసారి అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. గుంటూరు జిల్లాలో వైసీపీకి సంబంధించిన జడ్పీ చైర్ పర్సన్ కత్తెర క్రిస్టినా మరియు ఆమె భర్త సురేష్ కుమార్ ఈరోజు వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు వారు తర్వాత టిడిపిలో జాయిన్ అవ్వడానికి కూడా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కొల్లూరులో జరిగే ప్రజాగాళం సభలో చంద్రబాబు సమక్షంలో వారు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే క్రిస్టినా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆమె భర్త కత్తెర సురేష్ కుమార్ కు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే తాడికొండ అసెంబ్లీ సీటుని వైసిపి అధిష్టానం మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితకు కేటాయించడం జరిగింది. ఈ కారణంగా మనస్థాపానికి గురి అయిన క్రిస్టినా దంపతులు పార్టీ నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.













