గుంటూరు జిల్లా తెనాలిలో కలకలం
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ యుగంధర్‌పై నలుగురు వైసీపీ కౌన్సిలర్లు దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో కలకలం రేపింది. నలుగురు కౌన్సిలర్ల నుంచి తనకు ప్రాణహని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కౌన్సిలర్‌తో పాటు ఆందోళన పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రా ప్యారిస్‌గా పేరుగాంచిన తెనాలిలో వైసీపీ ఆరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అనితీని ప్రశ్నించిన పాపానికి టీడీపీ కౌన్సిలర్ యుగంధర్‌పై దాడి చేయడం దుర్మార్గమన్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించాల్సిన చోట దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల చేతిలో మూల్యం చెల్లించక తప్పదన్నారు. యుగంధర్‌పై దాడి చేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













