వైసీపీ బలం..బలగం.. ఆ ప్రాంతాలే..
ఏపీలో ఎన్నికల జోరు బలంగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ పై జనాలు అసంతృప్తితో ఉన్నారు అన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది అయితే తాజాగా వస్తున్న సర్వేలను బట్టి రూరల్ ఏరియా లో వైసీపీ బాగా బలంగా ఉందని అంటున్నారు. రూరల్ బేస్ లో నూటికి డెబ్బై మంది వైసీపీ పలికే పలుకుతున్నారు. మరోపక్క అర్బన్ సెక్టార్ లో మాత్రం జగన్ సర్కార్ పై తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోంది. గట్టిగా 25 నుంచి 30 శాతం మాత్రమే వైసీపీ కి మద్దతుగా ఉన్నారని టాక్. దీంతో వైసీపీ కూడా ఫుల్ ఫోకస్ రూరల్ ఏరియాపై పెడుతోందట. గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలు అయినప్పుడు పార్టీ పెద్దలు చెప్పిన మాట కూడా ఇదే. మా కోటా ఓట్లు వేరే ఉన్నాయి.. అంటూ అప్పుడు వారు చెప్పిన మాటలకి అర్థం ఇదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైగా జగన్ సర్కార్ అవలంబిస్తున్న పథకాల వల్ల ఎక్కువ లబ్ధి పొందుతోంది కూడా రూరల్ సెక్టార్ ప్రజలే.. అందుకే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవే పార్టీ పాలిట శ్రీరామరక్షగా మారబోతున్నాయి. పల్లెటూర్లే కదా అని తేలికగా తీసేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఏపీలో నాలుగు కోట్ల పదమూడు లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు లెక్క తేలింది. అర్బన్ సెక్టార్ కు చెందిన ఓటర్లు 85 లక్షల మంది వరకు ఉంటే.. రూరల్ లో మూడు కోట్ల ముపై లక్షల మంది దాకా ఓటర్లు ఉన్నారు. అర్బన్ ఓటర్లు ఓ 20 శాతం మంది వైసీపీ కి జై కొట్టిన రూరల్ మద్దతుతో విజయం సునాయాసం అవుతుందని వైసీపీ అంచనా.













