వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్య వరప్రసాద్
ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలకు వైకాపా అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరు ఖారారైంది. ఆయన నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన్ను ప్రతిపాదిస్తూ పది మంది ఎమ్మెల్యేల సంతకాలతో సహా నామినేషన్ పక్రియకు వైకాపా ఏర్పాట్లు చేసింది. అభ్యర్థిగా డొక్కా పేరును వైకాపా అధికారికంగా ప్రకటించలేదు. ఆయనతో నేరుగా నామినేషన్ దాఖలు చేయిస్తోంది. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. టీడీపీ నుంచి అభ్యర్థి బరిలో ఉండరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాణిక్యవరప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.













