టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు
యార్లగడ్డ వెంకట్రావు నేడు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్ లో లోకేశ్ పసుపు కండువా కప్పి యార్లగడ్డను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. యార్లగడ్డకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, పంచుమర్తి అనురాధ, వంగవీటి రాధా తదితరులు పాల్గొన్నారు. టీడీపీలో చేరిన యార్లగడ్డకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. యార్లగడ్డ టీడీపీలో చేరిన సందర్భంగా వంశీ పోవాలి యార్లగడ్డ గెలవాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు రేపు గన్నవరంలో యువగళం భారీ బహిరంగ సభ జరుగనుంది. దాదాపు 2 లక్షల మంది బహిరంగ సభకు హాజరయ్యేలా తెలుగుదేశం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.













