తెలుగుభాష పూర్వ వైభవానికి కృషి
తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ లక్ష్మీప్రసాద్ చెప్పారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా అధికార భాషా సంఘానికి చిరునామానే లేదని, ఆ పదవిలో ఎవరిని నియమించలేదని అన్నారు. జనగ్మోహన్రెడ్డి సీఎం అయినా మూడు నెలలకే తెలుగు అధికార భాషా సంఘానికి తనను అధ్యక్షుడిగా నియమించారని, బాధ్యతలు చేపట్టేందుకు కార్యాలయానికి వెళ్తే అక్కడ ఏమీలేవని వాపోయారు. పిల్లలకు మాతృభాషలో విద్యా బోధన సాగాలని, ఇదే తన కర్తవ్యంగా భావించి పని చేస్తానని తెలిపారు.













