యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కుమార్తె సాహితి వివాహం
హిందీ ఆకాడమీ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కుమార్తె సాహితి వివాహం అమెరికాలోని సిన్సినాటి(ఒహియో)కి చెందిన బ్రెంట్ ఫ్లెచర్తో తిరుమల లో వేడుకగా జరిగింది. హిందూ సంప్రదాయంలో జరిగిన ఈ వివాహానికి వరుడి తల్లిదండ్రులు మోరియాన్, గ్యారీ ఫ్లెచర్ కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు ధరించి హాజరయ్యారు. శనివారం ఉదయం వీరంతా శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. హిందూ సంప్రదాయాలు, కట్టుబాట్లు నచ్చి బ్రెంట్ ఫ్లెచర్ భారత్కు వచ్చారని, వివాహం జరిగిన తీరుపై ఆనందం వ్యక్తం చేశారని యార్లగడ్డ తెలిపారు.













