ప్రజా సంక్షేమం పట్టని వ్యక్తి ముఖ్యమంత్రా? : యరపతినేని
రానున్న ఎన్నికల్లో వైసీపీ చాప చుట్టేయడం ఖాయమని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో రాజారెడ్డి రాజ్యంగం అమలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారు. జగన్ను ఇంటికి పంపేందుకు ఐదు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఏపీని నాశనం చేశారు. పోలీసు వ్యవస్థను భ్రస్టు పట్టించి వారికి చెడ్డపేరు తెచ్చారు. రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి లేదు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం నిర్వీర్యమైంది. పంట నష్టపోయిన రైతులు ఇబ్బంది పడుతుంటే వారిని ఏనాడైనా పరామర్శించారా? ప్రజా సంక్షేమం పట్టని వ్యక్తి ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు.













