ఆ ఇమేజ్‌ని డామేజ్ చేయడమే ఆయన డ్రీమ్
ముఖ్యమంత్రి జగన్ నిర్వాకాలతో రాష్ట్రం నశనం అవుతోందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఏపీ ఎకానమీని వైసీపీ నేతలు కావాలనే మందగింపచేశారు. ఎన్నికల్లో పొందిన టీఆర్ఎస్ మేలుకి ప్రత్యుపకారమే ఏపీలో వైసీపీ సృష్టించిన మాంద్యం. అమరావతి ఎకానమీని దెబ్బతీసి హైదరాబాద్ ఎకానమీని పెంచడమే సీఎం లక్ష్యం. టీఆర్ఎస్ రుణం తీర్చుకోవడానికి ఏపీ అభివృద్ధికి గండికొట్టడం హేయం అని ఆయన ధ్వజమెత్తారు. ఏపీకి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ను పెంచారని, ఆ ఇమేజ్‌ని డామేజ్ చేయడమే జగన్ డ్రీమ్ అని మండిపడ్డారు. రాకూడని ఆర్థిక అవలక్షణాలన్నీ ఈ రాష్ట్రానికి వచ్చాయంటూ విమర్శించారు. జీఎస్టీపై జగన్‌కు అవగాహన లేదని విమర్శించారు. వైసీపీ నేరాల చరిత్ర చూసి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారన్నారు.













