అమరావతిలో మరో ప్రఖ్యాత విద్యా సంస్థ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రఖ్యాత విద్యా సంస్థ వస్తోంది. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎక్స్ఎల్ఆర్ఐ) సంస్థ అమరావతిలోని ఐనవోలు సమీపంలో క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. ఈ నెలలో శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సంస్థకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) ఎకరం రూ.10 లక్షల చొప్పున 50 ఎకరాలు కేటాయించింది. మొత్తం మూడు దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 1949లో జంషెడ్పూర్లో ప్రారంభమైన ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ, భువనేశ్వర్లో రెండో క్యాంపస్ ఏర్పాటు చేసింది. మూడో ప్రాంగణాన్ని ఇప్పుడు అమరావతిలో ప్రారంభిస్తోంది.













