విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు : మండలి బుద్ధ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పీబీ సిద్దార్థ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ నెల 23, 24 తేదీల్లో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా తెలుగు రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో 2007, 2011, 2015, 2019 సంవత్సరాల్లోనూ ప్రపంచ మహాసభలను ఘనంగా నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత సభలనూ విజయవంతం చేస్తామన్నారు. మారుతున్న దేశ, కాలమాన పరిస్థితుల్లో తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర, సామాజిక రంగాల అభివృద్ధిలో రచయితల పాత్ర, కర్తవ్యం, కార్యాచరణ లక్ష్యాలుగా సభల్లో సాహితీవేత్తల సమక్షంలో సదస్సులు, చర్చలు ఉంటాయన్నారు. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి 1,300 మందికి పైగా తెలుగు రచయితలు పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడిరచారు.













