విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
ప్రపంచ తెలుగు రచయితల 5వ మహాసభలు ఈ నెల 23 24 తేదీల్లో విజయవాడలో జరగనున్నాయి. కృష్ణా జిల్లా రచయితల సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, ప్రపంచ సాహిత్య వేదిక, సిలికానాంధ్ర, సిద్దార్థ అకాడమీ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై సభలు ప్రారంభిస్తారు. విజయవాడలోని పి.బి. సిద్దార్థ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆదికవి నన్నయ్య, నందమూరి తారకరామారావు, పీవీ నరసింహారావు వేదికలపై ఇవి రెండు రోజులపాటు జరుగుతాయి. అనేకమంది తెలుగు రచయితలు, సాహితీవేత్తలు పాల్గొని తెలుగు భాష సంస్కృతి, కళలు సాహిత్యం, సామాజిక పరిస్థితులు వంటి అంశాలపై చర్చించనున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వంటి ప్రముఖులు ప్రసంగిస్తారు.













