Chandrababu: ఏఐ వినియోగించినా.. మానవీయ కోణం ముఖ్యం : చంద్రబాబు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అంశంపై సచివాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైనా సీఎం చంద్రబాబు(Chandrababu) ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. గుడ్ గవర్నెన్స్ (Good Governance) కోసం ఏఐ(AI) సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, ఫలితాలను పరిశీలించారు. ఏయో విభాగాల్లో ఎలాంటి సాంకేతిక వాడొచ్చు. ప్రస్తుత సమాచారం ఆధారంగా సేవలను ఎలా విస్తృత పరచవచ్చు అనే అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
పాలనలో ఏఐ వినియోగించినా, మానవీయ కోణం ముఖ్యమని చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ వినియోగంతో రియల్‌టైమ్‌లో సేవలు అందిస్తామన్నారు. స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ త్వరలో డేటా లేక్ ఏర్పాటు చేస్తామన్నారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ వర్క్‌షాప్ రెండు రోజుల పాటు జరగనుంది.ఈ వర్క్‌షాప్‌నకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta), వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీశాఖ మాజీ సెక్రెటరీ చంద్రశేఖర్ (Chandrasekhar) సహా పలువురు నిపుణులు హాజరయ్యారు.













