ఏయూను సందర్శించిన అమెరికా నావికాదళ బృందం
ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అమెరికా నావికాదళ బృందం సందర్శించారు. ముందుగా ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద్ రెడ్డితో పరిపాలనా భవనంలో సమావేశమయ్యారు. యూఎస్ నేవీ కెప్టెన్ కమాండిరగ్ ఆఫీసర్, ఎన్ఎస్ఎస్ సోమిర్సెట్ (ఎల్పిడి 25) కెప్టెన్ మిచెల్ సి.బ్రాండ్ నేతృత్వంలో పలువురు నావికాదళ సిబ్బంది ఉన్నారు. ఈ బృందానికి ఏయూ ఎన్సిసి విద్యార్థులు గౌరవ వందనంతో స్వాగతించారు. అనంతరం అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా నావికాదళం కమాండింగ్ ఆఫీసర్ మిచెల్ సి బ్రాండ్ మాట్లాడుతూ సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖనగరం తమకు ఎంతో నచ్చిందన్నారు. సముద్రతీరం, ఎతైన కొండలు కలిగిన ఈ ప్రాంతం తమకు నచ్చిందన్నారు. భారతీయ సంస్కృతిని తాము నేర్చుకుంటున్నామన్నారు. విభిన్న విభాగాలతో పెద్ద విశ్వవిద్యాలయంగా ఏయూ తమకు కనిపిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం. జేమ్స్ ఎంజేమ్స్ స్టీఫెన్, అమెరికన్ ఎంబీసీ అధికారి జో క్రిష్టోఫర్ తదితరులు పాల్గొనగా, అమెరికా నావికాదళ సిబ్బంది అమెరికన్ కార్నర్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని వాల్ పెయింటింగ్ చేసారు. అమెరికా కార్నర్లో అమెరికా నావికాదళం కమాండిరగ్ ఆఫీసర్ సి.బ్రాంట్త్ ప్రసంగించారు.













