ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ… బరిలో 41 మంది
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 77 మంది నామినేషన్లు వేయగా 17 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బీజేపీ సాగర్ నియోజకవర్గ ఇన్చార్జి నివేదితారెడ్డి, ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థి కుతుబుద్దిన్లు తిరస్కరణ జాబితాలో ఉన్నారు. మరో 19 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది. దీంతో ఉప ఎన్నిక బరిలో 41 మంది ఉన్నట్లు రిట్నరింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీఓ రోహింత్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, బీజేపీ నుంచి రవికుమార్ నాయక్ బరిలో ఉన్నారు. ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటించనున్నారు.













