సోము వీర్రాజు సంచలన ప్రకటన…. 2024 తర్వాత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు 2024 తర్వాత తాను రాజకీయాలలో ఉండను అంటూ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 42 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నానని, రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. తాను పదవులు ఆశించి పని చేయలేదని, తనను సీఎం అవ్వాలనే కోరిక లేదన్నారు. గత కొద్ది రోజులుగా తనకు డిపాజిట్లు కూడా రాలేదంటూ పనిగట్టుకొని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తూ మానసిక స్థైర్యం కోల్పోయేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను మానసిక స్థైర్యం కోల్పోయే వ్యక్తిని కాదని చెపుతూ 1981లోనే సమితి అధ్యక్షునిగా వేరే వాళ్లను పెట్టి 900కు పైగా ఓటు సాధించినట్లు తెలిపారు.













