ఏపీ ప్రభుత్వం ముందుకొస్తే… అప్పుడు ఆలోచిస్తాం
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని తీసుకోవడానికి ఆంధప్రదేశ్ ప్రభుత్వం ముందుకొస్తే, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. నష్టాల్లో ఉన్న ఈ ఫ్లాంట్‌ను నడపడం కేంద్రానికి భారంగా మారిందని అన్నారు. నష్టదాయక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని విధాన నిర్ణయం తీసుకుందని, ఇందులో భాగంగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆమోదించిందని వెల్లడించారు. రాజకీయ స్వార్థం కోసమే విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారని ఆరోపించారు.













