వాళ్ల బాధ్యత సీఎం జగన్ తీసుకుంటారా?
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరై, వారితో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు కరోనా బారిన పడితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుంటారా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆన్లైన్ క్లాసులకు హాజరై వ్యక్తిగతంగా పరీక్షలకు వెళ్లిన విద్యార్థులు కరోనా బారిన పడిన ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ప్రభుత్వంలో మార్పు వస్తేనే కరోనా కట్టడి సాధ్యం అన్నారు. ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోంది. ఈ వైఖరితో విద్యార్థుల జీవితాలకే పరీక్ష పెడుతున్నారు. దేశంలో అనేక ర్ఱాష్టాలు పరీక్షలు వాయిదా వేస్తున్నాయని తెలిపారు.













