వైఎస్సార్ కు లేని నిబంధనలు జగన్ కు మాత్రం ఎందుకు?
ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో శ్రీవారి తిరుమల లడ్డుపై (Tirumala Laddu) ఎటువంటి వివాదం జరుగుతుందో అందరికీ తెలుసు. వీటన్నిటి నడుమ స్వామివారికి చంద్రబాబు (Chandra Babu) వల్ల జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల దర్శనానికి వస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పేర్కొనడం.. అతను డిక్లరేషన్ ( Declaration ) పై సంతకం పెడితేనే దర్శనానికి అనుమతించాలని కూటమి నేతలు డిమాండ్ చేయడం.. ఈ పరిస్థితుల నడుమ జగన్మోహన్ రెడ్డి తన తిరుమల ప్రయాణాన్ని (Jagan Tirumala trip)క్యాన్సిల్ చేసుకోవడం అన్ని ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి.
వీటన్నిటి మధ్యలో అందరూ మర్చిపోయిన ఓ చిన్ని సంగతి గురించి చర్చించుకుందాం. వైయస్ జగన్మోహన్ రెడ్డి దివంగత నేత.. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్(YSR )కొడుకు. చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ లది చాలా పాత అనుబంధం. రాజకీయాలలో ఒకేసారి ప్రవేశించిన ఈ ఇద్దరు ఒకేసారి మంత్రులయ్యారు. మొదట్లో ఇద్దరు ఒకే పార్టీకి చెందిన నేతలు కావడంతో ఇద్దరి మధ్య మైత్రి కూడా ఉండేది. అయితే ఎన్టీఆర్ (NTR) స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి (Telugu Desam Party) చంద్రబాబు చేరడంతో ఈ ఇద్దరు ఒకరికి ఒకరు పొలిటికల్ గా పోటీ అయ్యారు. ఇద్దరిలో ముందుగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఏకంగా తొమ్మిదేళ్లపాటు పాలన కొనసాగించారు. ఆ తరువాత 2004లో ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి 2009 దాకా ఐదు సంవత్సరాలు సీఎంగా వ్యవహరించారు. ఈ ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఆయన తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఇక్కడ అందరూ గుర్తు చేసుకోవాల్సిన ఒక చిన్న విషయం
వైఎస్సార్ మతాన్ని నమ్ముతారు.. మరి అలాంటప్పుడు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు డిక్లరేషన్ పై సంతకం పెట్టారా? అసలు నిన్న మొన్నటి వరకు ఈ ఉసు కూడా లేదు కదా. మరి ఇప్పుడు జగన్ విషయంలో మాత్రమే ఈ డిక్లరేషన్ ని ఎందుకు అంత హైలెట్ చేస్తున్నారు. ఇక 2009లో ఎంపీగా తిరుమలకు వెళ్లిన జగన్ డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు అని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఓ డిబేట్లో పేర్కొన్నారు.
అనంతరం 2019 నుంచి వరుసగా ఐదు సంవత్సరాల పాటు శ్రీవారిపై తన భక్తి శ్రద్దలను నిరూపించుకుంటూ జగన్ ప్రతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకు మించిన డిక్లరేషన్ స్వామి వారికి అవసరమా? అసలు ఇప్పుడు జరుగుతున్న సమస్య తిరుమల లడ్డు తయారీలో జరిగిన అపచారం గురించా.. లేక జగన్ డిక్లరేషన్ ఇస్తాడా లేదా అన్న విషయం గురించా.. జగన్ తిరుమలకు రాబోతున్నారు అన్న రోజు నుంచి డిక్లరేషన్ గొడవే తప్ప లడ్డు గురించి అందరూ మర్చిపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మొన్నటి వరకు జగన్ చంద్రబాబు స్థాపించిన అమరావతి పై కక్ష సాధింపు చర్యలు జరిపారు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్ పై తిరిగి అదే రకంగా ప్రవర్తిస్తుంది. మరి రెండు ప్రభుత్వాల్లో తేడా ఏమిటి? రాజకీయాలు ఉండేది కక్ష సాధింపు చర్యలకా? లేక ప్రజల కోసం పని చేయడానికా?













